రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
బీజేపీ దళితులను అవమానించిందని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఖండించారు. రామ్ లీలా మైదానం శుద్ధీకరణ గురించి ఆదివారం జాతీయ మీడియాకు ఆయన క్లారిటీ ఇచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన పూజా కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.ఆయన చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రామ్ లీలా మైదానంలో జరిగిన క్రతువులో దళితులు కూడా పాల్గొన్నారని స్పష్టంచేశారు.ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే ప్రసంగం తర్వాత శుద్ధీకరణ చేశామనడంలో వాస్తవం లేదన్నారు.అవన్నీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని వెల్లడించారు.వేరే ఇతర కారణాల వలన అక్కడ పూజ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అసలు విషయం రాహుల్ గాంధీకి తెలిసినప్పటికీ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు మండిపడ్డారు.
