National
రాహుల్ గాంధీ పోటీకి భయపడ్డారు.. ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సమాజ్‌వాది పార్టీ నేత, ప్రతాప్‌గఢ్ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలి స్థానం నుంచి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారని విమర్శించారు. సమాజ్‌వాది పార్టీతో పొత్తు లేకపోయి ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ, 2024లో రాయ్‌బరేలితో పాటు వయనాడ్ నుంచి పోటీ చేసి రెండింట్లోనూ గెలుపొందిన సంగతి తెలిసిందే.
