National

Rahul Gandhi: ‘వాళ్లు దోషులైనా లేదా అసమర్థులైనా అయివుండాలి’.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!

పార్లమెంటు భవనం వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు సాగించిన బలప్రయోగాన్ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో నిరసించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, పాలకులు దోషులైనా అయ్యుండాలి లేదా తీవ్ర అసమర్థులైనా అయ్యుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.