Rahul Gandhi Arrested: రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్.. 9 గంటల పాటు ఆకాశవాణి భవన్ వద్ద ధర్నా!
Rahul Gandhi Arrested: దేశ రాజధానిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఆకాశవాణి భవన్ ఆవరణలో దాదాపు 9 గంటల పాటు కూర్చున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు అగ్రనేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 50 మంది ఎంపీలతో పాటు సుమారు 250 మందిని పోలీసులు డిటెయిన్ చేశారు.పార్లమెంట్ మెయిన్ గేట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కు ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నీతి ఆయోగ్, ఆకాశవాణి భవన్ వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా ఊపుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
