Rahul Gandhi: ఢిల్లీలో రాహుల్ వన్ మ్యాన్ షో? మిత్రపక్షాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ డ్రామానా!
Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల వెనుక సరికొత్త రాజకీయ చక్రవ్యూహం దాగుందా? ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై నిరసనల పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న రచ్చ ఇప్పుడు సొంత ‘ఇండియా’ కూటమిలోనే తీవ్ర అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో జరుగుతున్న ఈ ఆందోళనలన్నీ కేవలం 'గాంధీ కుటుంబం పబ్లిసిటీ స్టంట్' మాత్రమేనని, విపక్షాల్లోని ఇతర ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని దెబ్బకొట్టేందుకే కాంగ్రెస్ ఈ మైలేజ్ డ్రామాకు తెరలేపిందన్న చర్చ హస్తిన వర్గాల్లో జోరుగా సాగుతోంది.గత కొద్ది రోజులుగా ఢిల్లీ రోడ్లపై సాగుతున్న ధర్నాల్లో మరే ఇతర విపక్ష నేతకూ కనీస ప్రాధాన్యం దక్కడం లేదు. టీవీ కెమెరాలు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా లైవ్‌లు.. ఇలా సమస్త ప్రచార వేదికలను రాహుల్, ప్రియాంక మాత్రమే హైజాక్ చేసేశారన్న ఆగ్రహం మిత్రపక్షాల్లో కనిపిస్తుంది.
