National
స్వాతంత్ర్య వేడుకలకు రాహుల్, ఖర్గే దూరం.. కారణం అదేనా?
రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఈ అధికారిక వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. వీరు ఎర్రకోట వేడుకలకు హాజరుకాకపోవడం వరుసగా ఇది రెండో ఏడాది కావడంతో, ప్రతిపక్షాల ఈ నిర్ణయంపై కేంద్ర అధికార పక్షం, రాజకీయ విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
