సినిమా
గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఓ గొప్ప బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రణబాలి మూవీ చేస్తోంది. అలాగే, మైసా అనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటిస్తోంది రష్మిక, ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయం కారణంగానే రెండు నెలలపాటు బ్రేక్ తీసుకుంది. అయితే, తాజా సమాచారం మేరకు లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతోంది.
