తెలంగాణ

మరో చపాతీ అడిగాడని విద్యార్థికి వాతలు.. గురుకులాల్లో ఆగని వేధింపులు!

రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వారిని వేధిస్తున్నది. ఫుడ్ పాయిజన్ ఘటనలు మరువక ముందే తాజాగా తోటి సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన వార్డెన్, ఉపాధ్యాయులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో గురుకుల పాఠశాలల్లో వరుస ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. అదనపు చపాతీ అడిగాడని 8వ తరగతి విద్యార్థికి సీనియర్లు పెనంతో వాతలు పెట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని బాలుర సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.