తెలంగాణ

RadialRoad2Scam: టెండర్లలో రూ.600కోట్ల స్కాం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన రాజగోపాల్ రెడ్డి!

 మంత్రివర్గంలో పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. రేడియల్ రోడ్-2 టెండర్ల ప్రక్రియ ఈ ఇద్దరి నేతల మధ్య అగ్గిరాజేసింది. ముఖ్యమంత్రి అండదండలతోనే ఈ టెండర్లలో దాదాపు రూ.600కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ రాజగోపాల్ రెడ్డికి చెందిన 'సుశీ ఇన్‌ఫ్రా' సంస్థ తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించింది. తమను అన్యాయంగా అనర్హులుగా ప్రకటించి, రూ.600కోట్లు ఎక్కువ కోట్ చేసిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించారని సుశీ ఇన్‌ఫ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.