National

Punjab : రేప్ కేసులో రూ.5 కోట్ల డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యకు ఎన్‌హెచ్‌ఆర్సీ షాక్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్యపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఓ అత్యాచారం కేసును తొక్కి పెట్టేందుకు ఆమె రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.