వ్యాపారం

పండుగ‌కు ముందే మండుతున్న ప‌ప్పుధాన్యాల ధ‌ర‌లు.. నెల‌రోజుల్లో 11శాతం పెంపు!

దేశవ్యాప్తంగా పండుగ‌లు స‌మీపిస్తున్న వేళ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలకు పెను భారంగా మారుతున్నాయి. రాబోయే ద‌స‌రా, దీపావళి పండగల‌ను దృష్టిలో ఉంచుకుని ఇళ్లలో నిల్వలు పెంచుకుంటున్న తరుణంలో కీలకమైన పప్పుధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ (IPGA) గణాంకాల ప్రకారం గత కొన్ని వారాల్లోనే శనగ, కంది, పెసర, బఠాణీ వంటి నిత్యావసర పప్పుల హోల్‌సేల్ ధరలు ఏకంగా 11 శాతం వరకు పెరగడం మార్కెట్‌లో కలకలం రేపుతోంది. గత నెల రోజుల్లోనే అత్యధికంగా వినియోగించే శనగపప్పు ధర 11 శాతం పెరగ్గా, పెసరపప్పు 10.6శాతం, కందిపప్పు 6.5శాతం, బఠాణీ 6 శాతం మేర ప్రియమయ్యాయి.