తెలంగాణ

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి : కేటీఆర్

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSU), ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి ఆస్తులని పేర్కొన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణ, తక్కువ విలువకు సంస్థ వాటాలను కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఐడీబీఐ బ్యాంక్ విలువను తగ్గించి చూపిస్తున్నట్టు వస్తున్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.