తెలంగాణ

ప్రోటోకాల్ రగడ.. సూర్యాపేటలో మాజీ మంత్రి వర్సెస్ మంత్రి!

రాష్ట్రంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. అధికారపార్టీ ఏదైనా ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం చేపడితే సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోడైనా, కాకపోయినా ఇన్విటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన బోర్డు, శిలాఫలకంలో సదరు ఎమ్మెల్యే పేరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, సూర్యాపేట నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు సెల్యూట్ బేస్ శిలాఫలకంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేరు వేయలేదని సమాచారం.దీంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ నేతలు కావాలనే తమను కించపరుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.