గేటు దూకి జంతర్‌మంతర్‌లో నిరసనలు.. సీజేపీ నేతల అరెస్టు!
ఎస్ఐఆర్, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరననలు ఆగడం లేదు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేయడానికి వీల్లేదని నిన్న ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలు ఇవాళ పోలీసుల కళ్లుగప్పి గేట్లు దూకి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. త్రివర్ణ పతాకం చేతబట్టుకొని కొందరు నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్ డీసీపీ కార్యాలయానికి లేఖ సమర్పించినప్పటికీ ఇవ్వలేదని తెలిసింది. అయితే, అనుమతులు లేకుండా ప్రదర్శనలు నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేదిక వద్దకు చేరుకున్న వెంటనే సౌరవ్ దాస్, రంకాలతో పాటు మరికొందరినీ పోలీసులు వాహనాల్లోకి ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
