బారికేడ్ పైకి ఎక్కి నిరసన.. రాహుల్, ప్రియాంకగాంధీ అరెస్టు
దేశరాజధాని ఢిల్లీలో ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టగా.. రాహుల్, ప్రియాంకగాంధీలు,ఇతర ఇండియా ఎంపీలు సైతం ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సీఈసీకి వ్యతిరేకంగా ఎంపీలు ఆందోళన చేస్తున్న క్రమంలోనే పోలీసు బారికేడ్పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని రాహుల్ గాంధీ నిరసన తెలిపారు.పలువురు ఎంపీలు సైతం బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ‘ఇండియా’ కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వరకు ఎంపీలు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
