తెలంగాణ

Project Baata: మేడిగడ్డ సాక్షిగా కేటీఆర్ ‘ప్రాజెక్ట్ బాట’.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా గులాబీ పార్టీ బిగ్ స్కెచ్!

Project Baata: తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో మరోసారి 'కాళేశ్వరం' సెంట్రిక్ వార్ మొదలుకాబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును ప్రధాన అస్త్రంగా మార్చుకుని బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతూ వస్తోంది. అయితే, ఈ ఆరోపణలను ఇకపై కేవలం ప్రెస్‌మీట్లతోనో, సోషల్ మీడియా ట్వీట్లతోనో తిప్పికొట్టడం సరిపోదని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. తమ మానసపుత్రికగా చెప్పుకునే ప్రాజెక్టు వేదికగానే కాంగ్రెస్ సర్కార్‌కు చెక్ పెట్టేందుకు సరికొత్త పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసిందికాంగ్రెస్ విమర్శల తీవ్రతను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ‘ప్రాజెక్ట్ బాట’ పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ బస్సు యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మొదలయ్యే ఈ బస్సు యాత్ర.. మిడ్ మానేరు లేదా లోయర్ మానేరు డ్యామ్ వరకు 2 నుంచి 3 రోజుల పాటు సాగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు, టన్నెళ్లను కేటీఆర్ స్వయంగా పరిశీలిస్తారు.