తెలంగాణ

Prohibited Lands: 22ఏ సమస్యను ప్రత్యేక టాస్క్‌గా తీసుకుని పని చేయాలి

22A Lands Row: 22ఏ ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు వస్తున్న కాల్స్, వాటి పరిష్కారం, ఏయే సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి, వచ్చిన కాల్స్‌కు ఎలాంటి సమాచారం అందిస్తున్నారు తదితర అంశాలపై బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు మంత్రి పొంగులేటి. నాలుగు జిల్లాల్లో 22ఏ అంశంపై ప్రస్తుత పరిస్థితి, దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.