తెలంగాణ
నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణంలో పురోగతి.. మంత్రి కీలక ఆదేశాలు!
తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసి, సామాన్య ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ చికిత్సలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసింది. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిమ్స్ విస్తరణ పనులతో పాటు గోషామహల్లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పురోగతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, టీజీఎమ్ఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.
