సినిమా

Priyamani: ఉత్తమ నటికి మెగా 158 కలిసొచ్చేనా?

Priyamani: ప్రియమణి తమిళ హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అదేమంత పేరు తెచ్చింది లేదు. అయితే, మెగా 158 మూవీలో ప్రియమణి చిరుకి జంటగా నటించనుంది. అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఇది కన్‌ఫర్మ్ న్యూసే. నారప్ప, విరాటపర్వం తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. వాస్తవానికి, ప్రియమణి మన సీనియర్ హీరోలకి మంచి జోడీ. అందాల విందులోనూ వెనకాడదు. కానీ, ఎవరి కన్నూ ఈ డస్కీ బ్యూటీపై పడటం లేదు ఎందుకో.