తెలంగాణ
వర్షాలు కురవాలని మొసలికి పూజలు.. (వీడియో వైరల్)
వర్షాలు కురవాలని కొందరు కప్పతల్లి వేషాలు వేస్తుంటారు. వాడవాడలా ఊరేగింపులు చేస్తుంటారు.కొందరైతే గాడిదలకు పెళ్లి చేసి ఊరేగిస్తుంటారు. ఇలా చేయడం వలన వర్షాలు కురుస్తాయని వారి నమ్మకం. అయితే, ఇవన్నీ మూఢనమ్మకాలు అని మరికొందరు కొట్టిపారేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి. మరికొందరు అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు సమర్పిస్తుంటారు.వరుణదేవుడికి సైతం మరికొందరు పూజలు చేస్తుంటారు.ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఓ వ్యక్తి ఏకంగా మొసలికి పూజలు చేయడం కలకలం రేపింది. దాని మీద పూలు చల్లి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద నీటిలో ఒక పెద్ద మొసలి కొట్టుకొచ్చింది.
