సినిమా
Prabhas: ఇన్‌స్టా డీపీ మార్చేసిన రెబల్ స్టార్..డార్లింగ్స్ ఫుల్ ఖుషీ
Prabhas: తాజాగా ప్రభాస్ తన ఇన్‌స్టా డీపీగా ఫౌజీ లుక్ ని అప్డేట్ చేశాడు. బాహుబలి సినిమా నుంచి ఇప్పటి వరకూ అదే లుక్ ప్రభాస్ ఇన్స్టాకి ఉండేది. బాహుబలి సినిమాలలో తండ్రీకొడుకులుగా మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రల మేకోవర్ లుక్ అద్భుతంగా ఉంటుంది. ఈ లుక్స్ ప్రభాస్‌కి ఎంతగానో నచ్చాయి. అందుకే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాహుబలి పోస్టర్‌నే ప్రభాస్ ఇన్‌స్టా డీపీగా పెట్టుకున్నాడు. కానీ, తాజాగా, ఆయన ఫౌజీ పోస్టర్‌తో అప్డేట్ చేశాడు.
