ఏపీ
ఏకాంతానికి అడ్డుతగిలిన విద్యుత్ తీగలు.. అడవిలో యువజంట కేకలు
ఏకాంతంగా గడుపుదామని అడవికి వెళ్లిన ఓ జంటకు విద్యుత్ తీగలు యమపాశంలా మారాయి. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు మీద పడటంతో యువతి, యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు. అడవిలోనే కిందపడిపోయి లేవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు వారి కేకలు విని అటుగా వచ్చిన గొర్రెల కాపరులు వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
