తెలంగాణ

టెకీలను భయపెడతున్న ‘కరెంట్’.. సర్కారుపై అసహనం!

రాష్ట్రంలో వేసవి రాకముందే కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పవర్ తీసేస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు.కరెంట్ కోతల కారణంగా ముఖ్యంగా వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఇయర్ ఎండ్ కావడంతో పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేసేందుకు టార్గెట్లు ఇస్తున్నారని, వాటిని పూర్తి చేద్దామంటే ఇష్టానుసారంగా కరెంట్ కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల సీజన్ పూర్తిగా ముగియక ముందే ఇలా అప్రకటితంగా కోతలు పెడితే సమ్మర్‌లో ఎలా ఉంటుందో అని ఇప్పటినుంచే టెకీలు ఆందోళన చెందుతున్నారు. అసలే ఐటీ సెక్టార్‌లో పరిస్థితులు బాలేవని, చిన్న చిన్న కారణాలు, కాస్ట్ కటింగ్, ఏఐ అప్‌గ్రేడ్, స్కిల్ అప్టేట్ చేసుకోలేదని ఉద్యోగాలు తీసేస్తున్న సమయంలో ఇలా కరెంట్ కోతలు పెడితే టార్గెట్ రీచ్ కాలేదని, ఇన్ టైంలో పెండింగ్ వర్క్స్ క్లియర్ చేయలేదని తమ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉందని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆవేదన చెందుతున్నారు.