తెలంగాణ

కరెంట్ కోతలు.. తప్పు మీరే చేసి అధికారులను బద్నాం చేస్తారా?: హరీశ్ రావు

రాష్ట్రంలో నెలకొన్న కరెంటు కష్టాలు, తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.గురువారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నారు.వేసవి రాకముందే రాష్ట్రంలో కోతలు మొదలు అయ్యాయని, ఈ సంక్షోభానికి ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వమే కారణమని స్పష్టంచేశారు. తప్పులు మీరు చేసి అధికారులపై నెపం నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని, అందుకు ప్రభుత్వమే కారణమని వెల్లడించారు. విద్యుత్ రంగంపై సమీక్షలు లేకపోవడంతో కరెంట్ కోతలు వస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.