National

పగలు సోలార్ ప‌వ‌ర్ ఓకే.. రాత్రి కరెంట్‌కు టెన్షన్! ఎల్‌నినోతో భారత్‌కు కొత్త సవాల్!

పగలు సోలార్‌ విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. కానీ రాత్రి సూర్యుడు ఉండడు. భారతదేశంలో వేసవి సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో పీక్ నెట్ లోడ్ సాధారణంగా కనిపిస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు కూడా డిమాండ్‌ రాత్రి పీక్‌ కంటే సగటున కేవలం 10 శాతం మాత్రమే తక్కువగా ఉంటోంది. అంటే రాత్రి కరెంట్‌ అవసరం తగ్గిపోవడం లేదు.