స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

కూకట్ పల్లి భూములను దోచుకునేందుకు డైరెక్టర్స్‌ అవతారం..! అందరూ ఆంధ్రావాళ్లే?

రాత్రికి రాత్రి కోటీశ్వరులం కావాలంటే ఏం చేయాలి. ఓ లిటిగేషన్ ల్యాండ్ పట్టుకుని అందరికీ లంచాలు ఇచ్చి రికార్డులు మార్చేసి కబ్జా పెట్టాలి. ఇదంతా అన్ అఫీషియల్. చేసేది తప్పయినా అఫీషియల్‌గా అనిపించాలి. ఇది బిజినెస్ మ్యాన్ థియరీ. కూకట్ పల్లి భూముల్లో కూడా అదే జరిగింది. ఒకేచోట 850 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని తెలిస్తే అందరికంటే ముందుగా ఆలోచించే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు కూకట్ పల్లిలో అదే జరిగింది. బెంగుళూరుతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్‌లో భారీగా ఐడీఎల్ కంపెనీ భూములు ఉన్నాయి. దీనిని గుర్తించిన హిందుజా కంపెనీ 2003లో బెంగళూరు, హైదరాబాద్ భూముల కోసమే కొనుగోలు చేసిందని ఆరోపణలున్నాయి.