తెలంగాణ
TG: దేశాన్ని 'అదానీ'కి కట్టబెడుతున్నారు.. బీజేపీ తీరుపై పొన్నం ఫైర్!
TG: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా అదానీ గ్రూప్‌కే ధారాదత్తం చేస్తోందని, యావత్ భారతదేశాన్ని ‘అదానీకరణ’ చేసే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా పర్యటన కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే పరిమితమైందని, తెలంగాణ ప్రయోజనాలపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను సూటిగా ఎండగట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కేవలం ఆ ముగ్గురు గుజరాతీయుల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.
