తెలంగాణ
TG: ఫారెస్ట్ భూముల సర్వేను దగ్గరుండి నేనే చూస్తా.. మంత్రి పొంగులేటి కామెంట్స్ వైరల్!
TG: తెలంగాణలో దశాబ్దాలుగా రైతులను, సామాన్య ప్రజలను కలవరపెడుతున్న అటవీ, రెవెన్యూ భూ సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో నలుగుతున్న ఈ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే జాయింట్ సర్వే ప్రక్రియను తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తానని మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ, అటవీ శాఖలు, సర్వే అండ్ సెటిల్మెంట్ అధికారులతో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
