తెలంగాణ
శక్తి స్కీం మాకొద్దు.. రేవంత్ ఎవరిని అడిగి తెచ్చారు? : పాలిటెక్నిక్ విద్యార్థులు
రేవంత్ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన శక్తి స్కీం పట్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినీవిద్యార్థులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సీఎం రేవంత్ తీసుకొచ్చిన శక్తి స్కీం వలన మూడు సంవత్సరాల సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ చేసిన తాము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలని నిబంధనం పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని వికారాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
