National
Polymer Banknotes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు కేంద్రం ఆమోదం.. తొలుత 100 కోట్లు విడుదల
Polymer Banknotes: దేశంలో ప్లాస్టిక్/పాలిమర్ కరెన్సీ నోట్లు తీసుకొచ్చే అంశానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదన మేరకు ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు ఆమోదం తెలిపింది. తొలుత ప్రయోగాత్మక పరిశీలన కోసం అత్యధికంగా చెలామణిలో ఉన్న, తక్కువ విలువ కలిగిన 10 రూపాయలు, 20 రూపాయల నోట్ల ముద్రణకు కేంద్రం ఓకే చెప్పింది.
