National

దీపావళి కానుకలతోనూ కాలుష్య ముప్పు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీపావళి పండుగ సందర్భంలో ప్రతి ఏటా కానుకలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం కూడా నగరంలో వాహన కాలుష్యం తీవ్రమవడానికి ఒకానొక కారణమవుతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతి శీతాకాలంలో తీవ్రమైన కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీలో శాశ్వత మార్పులు రావాలంటే కేవలం ప్రభుత్వ నిబంధనలే కాకుండా, ప్రజల ఆలోచనా విధానంలో, జీవనశైలిలో సైతం సాంస్కృతిక మార్పులు రావాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది.