National

politics : చిక్కుల్లో ‘దీదీ’.. టీఎంసీ ఆఫీసులో మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య

పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఎవరైతే ఆమెకు నమ్మకస్తులుగా ఉన్నారో వారిమీద కేసులు ఫైల్ అవ్వడం, జైలు వెళ్లడం జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడంతో గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేరచరిత్ర కలిగిన వారిపై చార్జ్‌షీట్ తెరిచి లోపల వేస్తున్నారు. అయితే, గత ప్రభుత్వంలో మాజీ మంత్రి,డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన టీఎంసీ నేత ఆశిశ్ బెనర్జీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.ఈ ఘటన బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా రాంపూర్ హాట్‌లో వెలుగుచూసింది.