వైరల్ న్యూస్
POLITICAL MEMES: '1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న '1980ల ఏఐ ఫొటో ట్రెండ్' భారత రాజకీయాల్లో కొత్త రచ్చకు దారితీసింది. నెటిజన్లు, ప్రముఖులు తమ నేటి ఫొటోలను 1980ల కాలంనాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకునే సరదా ట్రెండ్‌గా ప్రారంభమైన ఈ ప్రక్రియ, చివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఏఐ మీమ్ వార్‌గా పరిణమించింది. ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ పరస్పరం విమర్శలు గుప్పించుకోవడానికి ఈ ఏఐ చిత్రాలను వాడటంతో సోషల్ మీడియా వేదికలు వేడెక్కాయి.
