స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

తెలంగాణ భూములపై రాజకీయ నాయకుల డ్రామాలు!..

ప్రపంచంలో ఏ యుద్ధం అయినా భూమి కోసమే జరిగింది. భూ సరిహద్దుల కోసమే రాజ్యాలు కూలిపోయాయి. నిలబడ్డాయి. భూమిని ఎవరు ఎలా అనుభవించాలో కాలానుకూలంగా చట్టాలు తయారు చేశారు. తెలివితో చంద్ర మండలంపై కూడా ప్లాట్లు అమ్మే ఈ రోజుల్లో జీవితాంతం కష్టపడుతూ ఈఎంఐలు కట్టుకుంటూ సొంతిల్లు కొనుగోలు చేసుకున్నా కనీసం అది అమ్ముకునే హక్కు కూడా లేదని చెబితే ఎలా అని ప్రశ్నించే స్థితి వచ్చింది. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. నాయకులకు తెలిసే జరిగిన వ్యవహారమేనన్న ఆరోపణలు ఉన్నాయి. కావాలనే భూస్వాములు, పెత్తందారులు కొత్త చట్టాల్లోని లొసుగులను గుర్తించి ఎలా పైకి వచ్చారో.. గత ఆరేళ్ల క్రితం ధరణి పేరుతో పుట్టుకొచ్చిన పుత్రిక కూడా పేదల జీవితాల్లో, వారి కష్టార్జిత భూముల్లో చీకటి రోజులను తీసుకొచ్చిందనే విమర్శలు ఉన్నాయి.