తెలంగాణ
పిల్లల విషయంలో నేతల ఎస్కేప్ పాలిటిక్స్.. బాధ్యత ఎవరిది?..
పార్టీ ఏదైనా పదవులు ఏవి ఉన్నా.. రాజకీయం అంటే రాచకీయం అనేలా మారిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజల మనిషిగా జీవిస్తూ.. అంటే నటిస్తూ.. ప్రజలే దేవుళ్ళు అని రోడ్లు పట్టుకుని ప్రచారాలు చేసే నాయకులు.. ఎన్నికలు ముగియగానే పరాయివాళ్ళలా ప్రవర్తించడం తెలిసిందే. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణ.. గతంలో బండి భగీరత్ విషయంలో బండి సంజయ్ మాట్లాడిన మాటలపై ప్రజల్లో చర్చ మొదలైంది. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు తప్పు చేస్తే ఆ నాయకులకు సంబంధం లేదా? పిల్లలు వేరు, మేము వేరు అంటూ చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు తలెత్తాయి..
