ఆడబిడ్డలు కాదు అరాచక శక్తులు? ఇద్దరూ ఇద్దరే!
ఇంటి ఆడబిడ్డలను తెలుగు గడ్డ ఎలాంటి కష్టం వచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. భర్తే సర్వస్వం అనుకుని బతికే సంస్కృతి ఉన్నా.. కూతురు సుఖంగా ఉందా? అని తాపత్రయపడటం మాత్రం ప్రతి తండ్రికీ సహజమే. అలాంటి తెలుగు రాష్ట్రాలను ఏలిన ఓ నేత మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో వాటాల పంపకం జరిగిందనే విమర్శలు వినిపించాయి. అయితే, ఆ తర్వాత ఆ బిడ్డ తన రాజకీయ ప్రయాణంలో మొదట తెలంగాణలో, ఆపై ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పేరుతో డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ సాధించి, ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడి బిడ్డ బతికుండగానే.. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. కుటుంబం, రాజకీయ వారసత్వం, ప్రజా ప్రయోజనాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
