పోలీసులు vs ఉద్యోగులు.. రోడ్ బ్లాక్‌తో వాహనదారుల పరేషాన్
హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. నగరం నలుమూలల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు నిన్న మహాగణపతిని దర్శించుకుని కడసారి వీడ్కోలు పలికారు. అయితే, సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి వరకు వచ్చిన విగ్రహాలను ఇవాళ ఉదయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతోంది.
నేటి సాయంత్రం వరకు మొత్తం నిమజ్జనం ప్రక్రియ పూర్తికానుందని సమాచారం. నిమజ్జనం ప్రక్రియ మొత్తం పూర్తికాకపోవడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆఫీసులు, వివిధ పనుల కోసం రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిమజ్జనం పూర్తయ్యిందని రెగ్యులర్‌గా వెళ్లే దారిలో వచ్చిన వారికి పోలీసులు షాక్ ఇచ్చారు.
