తెలంగాణ

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి.. పోలీసుల పిటిషన్

TG Politics : రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా హాట్‌టాపిక్‌గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిల కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో.. ఇద్దరు ఎమ్మెల్సీలకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.అసెంబ్లీ వద్ద ఆందోళన సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడం, విధులకు ఆటంకం కలిగించడం, స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా నాంపల్లి కోర్టు ఇద్దరు ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు చేసింది.