తెలంగాణ
శోభాయాత్రలో పోలీసులు.. పీఎస్లో రెండు కుటుంబాల ఫైటింగ్
రాష్ట్రంలో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతుండగా పోలీసులు విధుల్లో నిమగ్నం అయ్యారు.ట్రాఫిక్ క్లియరెన్స్, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్లో నానా రభస చేశాయి. స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డాయి. దీనికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం కాస్త తొలుత మాటల యుద్ధం, ఆపై పరస్పర దాడులకు దారితీసింది.ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు పీఎస్లోకి దూసుకెళ్లాయి.
