తెలంగాణ
సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి లాగిన పోలీసులు..?
రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పోలీసులు, బీఆర్ఎస్ శాసనసభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ పాలనా వైఫల్యం, హామీలపై నిలదీస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపిన బీఆఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్దకు పాదయాత్రగా బయలుదేరారు. తీరా అసెంబ్లీ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్ల దుస్తులు, ప్లకార్డులు పట్టుకోని లోనికి వెళ్లడానికి వీల్లేదంటూ ఆపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు, పోలీసుల నడుమ నెలకొన్న వివాదం ముదిరింది. తోపులాట నెలకొనడంతో పోలీసులు వారిని లాగేశారు.
