క్రైమ్
చౌటుప్పల్లో జోగిని హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నగలు నగదు కోసమే మర్డర్
Jogini Sudhakar: చౌటుప్పల్ లో నిన్న జరిగిన జోగిని సుధాకర్ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన 24 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారు. నగలు, నగదు కోసమే జోగిని సుధాకర్ ను హత్య చేసినట్టు నిర్ధారించారు. హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 130 తులాల 600 గ్రాముల బంగారం, రూ 9 లక్షల నగదు, ఒక కారు, హత్యకు ఉపయోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు.
