తెలంగాణ
మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. హైకోర్టు సీరియస్..
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇవాళ జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ్యుల హక్కులు, సభా వ్యవహారాల్లో పోలీసుల అధికార పరిధికి సంబంధించి ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కీలక ఆదేశాలిచ్చింది.
