క్రైమ్

Pocso Case: తెలంగాణ బాస్కెట్ బాల్ సెక్రటరీ పృథ్వీశ్వర్‌పై పోక్సో కేసు

Pocso Case: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. బాలికను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదవడంతో పృథ్వీశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 24న అతడిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడని, రంగారెడ్డి జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. పోక్సో కేసు బయటకు రాకుండా కొందరు పెద్దలు మ్యానేజ్ చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. బాధితురాలి తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.