తెలంగాణ
Pocharam Srinivas Reddy: అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను, అన్నం పెట్టినోడిని మరువడం కష్టంగా ఉంది- ఎమ్మెల్యే పోచారం సంచలన వ్యాఖ్యలు
Pocharam Srinivas Reddy: సీనియర్ నేత, ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ పై తిరుగుబాటు చేశారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేకపోయినా.. తప్పలేదని వాపోయారు. కేసీఆర్ వల్లే అభివృద్ధి జరిగిందని నేనే చెబుతున్నా అన్న పోచారం.. అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉందన్నారు. కొన్ని రాజకీయ పరిణామాల వల్లే పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన వివరించారు. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నా, కాంగ్రెస్ జెండాను కాదని పోచారం అన్నారు.
