చిత్రం లేదు
National

PNB Scam: పీఎన్‌బీలో రూ.35 కోట్ల స్కామ్.. మేనేజర్‌తో సహా ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్!

PNB Scam: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో వెలుగు చూసిన రూ.35 కోట్ల స్కామ్ తీవ్ర దుమారం రేపింది. ఖాతాదారుల పర్మిషన్ లేకుండానే కోట్ల రూపాయల డిపాజిట్లు పక్కదారి పట్టినట్లు తేలడంతో బ్యాంకు యాజమాన్యం తక్షణ చర్యలకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులుగా తేలిన బ్రాంచ్ మేనేజర్‌తో సహా మొత్తం ఐదుగురు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్ల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రూ.35 కోట్లు మాయమైన వ్యవహారం బయటకు రాగానే పీఎన్‌బీ ఉన్నతాధికారులు, విజిలెన్స్ బృందాలు సదరు బ్రాంచ్‌పై దృష్టి సారించాయి. అంతర్గత తనిఖీల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. మేనేజర్‌తో పాటు మరో నలుగురు సిబ్బందిపై వేటు వేశారు.