National

PM Modi: సైబర్‌ ఉగ్రవాదులతో జాగ్రత్తగా ఉండాలి.. ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరిక!

PM Modi: యుద్ధాలు అంటే బోర్డర్ల దగ్గర తుపాకులు పట్టుకుని పోరాడటమే కాదని, సైబర్ ఉగ్రవాదులు మన ఆర్థిక వ్యవస్థ మీదే కన్నేశారని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ దొంగలు, సైబర్ ముఠాల నుంచి మన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఒడిశాలో రూ.169 కోట్లతో ఏర్పాటు చేసిన ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత అక్కడ మాట్లాడిన ప్రధాని, సరికొత్త తరహా యుద్ధాల గురించి సంచలన విషయాలు చెప్పారు."ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే జరగడం లేదన్నది అందరికీ తెలుసు. ఒక దేశాన్ని దెబ్బకొట్టాలంటే ఆ దేశ డబ్బు చలామణిని, బ్యాంకింగ్ వ్యవస్థను టార్గెట్ చేస్తే చాలు. భారత్ వేగంగా ఎదుగుతున్న ఈ టైమ్‌లో మన బ్యాంకుల మీద సైబర్ ఉగ్రవాదులు గురిపెట్టే ప్రమాదం ఉంది.