International

దిగొచ్చిన మార్క్ జుకర్ బర్గ్.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు

ఫేస్ బుక్ లో ప్రధాని మోదీ వీడియో తాత్కాలిక తొలగింపు వివాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దిగొచ్చాడు. వీడియో తొలగింపు అంశంలో క్షమాపణలు చెప్పాడు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్ పై ఆయన విచారం వ్యక్తం చేశాడు.