National
PM-Kisan Scheme: కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం.. ఈ రంగాలకు బడ్జెట్ కేటాయింపు!..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మొత్తం రూ.4 లక్షల 50 వేల 988 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. రైతుల ఆదాయం పెంచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
