ఏపీ
ప్లీజ్ నన్ను తీసుకెళ్లండి.. ఏపీలో హైదరాబాద్ యువతి సూసైడ్!
ఏపీలో మరోదారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఏపీలో తాను చదువుకుంటున్న కాలేజ్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కానూరులో చోటుచేసుకోగా.. స్థానికంగా సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన కంతేటి వైష్ణవి(19).. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కానూరులో గల శ్రీ భారతి ఇన్‌స్టిట్యూట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ సెంటర్‌లో మూడు వారాల కిందట నీట్ శిక్షణ కోసం చేరింది.
