National

దయచేసి నా భర్తను విడిచిపెట్టండి : ధ్రువ్ రాఠీ భార్య

కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వీరికి తోడు పలు లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘాలు సైతం ఆందోళనల్లో పాల్గొన్నాయి. నిరసన కారుల్లో కొందరు రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టిన ఢిల్లీ పోలీసులు.. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తరలించారు. ఇదిలాఉండగా, తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ యూట్యూబర్ ధృవ్ రాఠీ భార్య జ్యూలీ రాథీ సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ పోలీసులను రిక్వెస్ట్ చేసింది. తన భర్త ఆచూకీ లభించడంలేదని, తన భర్తతో పాటు అతడి స్నేహితుల ఫోన్స్ కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఢిల్లీ పోలీసులు కస్టడీ నుంచి తన భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమైంది.